చీపురుపల్లి: ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు గారు చీపురుపల్లి మండలం పరిధిలో గల తోటపల్లి కాలువ వద్ద రైతన్నలతో కలిసి ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ… ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలన్నదే చంద్రన్న ధ్యేయం అని అన్నారు. రైతులంతా నీటి వనరులను సక్రమ పద్ధతిలో ఉపయోగించుకుని ఖరీఫ్ పంటలను సాగు చేసుకోవాలని అన్నారు.రైతాంగం ఆశలను చిగురింప చేసి,వరి సాగుకు నీరిచ్చి,రైతాంగానికి అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు గారికి రైతన్నల తరుపున కృతజ్ఞతలు తెలిపారు రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు, అధికారులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ విద్యాకమిటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ జమ్ము ప్రసాద్ గారు లారీ-బైక్ ఢీకొని ఒకరి మృతి