చీపురుపల్లి, జనవరి 21,
చీపురుపల్లి ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర మహోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జాతర కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ ఉత్సవాలకు నాందిగా బుధవారం (ఈరోజు) నిర్వహించిన “ముహూర్తపు రాట” కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువనేత, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ.. చీపురుపల్లి ప్రాంత ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. సుమారు మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర మహోత్సవం మన సంస్కృతికి, భక్తికి ప్రతీక అని ఆయన కొనియాడారు.
జాతర తేదీలు: ఫిబ్రవరి 22, 23 మరియు 24.
వందలాది మంది భక్తులు పాల్గొనే ఈ జాతరను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు, కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
రామ మల్లిక్ నాయుడు వెంట స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ 28వ జాతర మహోత్సవంలో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.







