* విద్యార్థులకు అన్నదానం, మిఠాయిలు పంపిణీ చేసిన కిమిడి రామ్ మల్లిక్ నాయుడు* పాల్గొన్న ఎన్డీఏ కూటమీ నాయకులు మరియు కార్యకర్తలు,రాష్ట్ర విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలంలో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. టిడిపి యువనేత, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో గరివిడిలోని మూగ మరియు బధిరుల పాఠశాల (డఫ్ & డమ్ స్కూల్) విద్యార్థులకు ఘనంగా భోజన వసతి మరియు మిఠాయిల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రామ మల్లిక్ నాయుడు గారు స్వయంగా విద్యార్థులకు భోజనాలను వడ్డించి, వారితో కాసేపు సమయాన్ని గడిపారు. మంత్రి నారా లోకేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాష్ట్ర అభివృద్ధిలో వారు మరిన్ని కీలక మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు.మంత్రి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఆయన జన్మదినం నాడు ఇలాంటి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల మధ్య గడపడం, వారికి సేవ చేయడం ఎంతో సంతోషాన్నిస్తోందని రామ మల్లిక్ నాయుడు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Spread the love టపా నావిగేషన్ క్రెడిట్ చోరీ చేయడం మీ నైజం.నిజాన్ని జనాలు ఎప్పటికప్పుడు తెలియజేయడం మా నైజం అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజనికే సిగ్గుచేటు;మేరకముడిదాం మండలం జేనసేన పార్టీ అధ్యక్షురాలు కృష్ణ వేణి.