*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ముగింపు వేడుకలు*:
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం సాయంత్రం “ప్రగ్యాన్ -2K26” పేరుతో నిర్వహించిన జాతీయ సాంకేతిక ఉత్సవాలు ముగింపు వేడుకలు కాలేజీ ప్రిన్సిపాల్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సిహెచ్.రాజశేఖర్ గారు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్,శ్రీకాకుళం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక సమాజానికి నేటి విద్యార్థులే ఆర్కిటెక్చర్ అని తెలుపుతూ ప్రాజెక్ట్ ప్రదర్శనలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ వంటి సాంకేతిక పోటీలు మరియు నిపుణుల ఉపన్యాసాలు విద్యార్థులకు విలువైన అనుభవాన్ని అందిస్తాయిని తెలిపారు.అలాగే ఇలాంటి కార్యక్రమాలు టీమ్‌వర్క్,నాయకత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయిని తెలిపారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కె.నారాయణ రావు గారు ప్రిన్సిపాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్,శ్రీకాకుళం నుండి విచ్చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐ సాంకేతిక రంగంలో పెను మార్పులు తీసుకువచ్చి సాంకేతిక రంగాన్ని మరంత సులభతరం చేసిందని తెలియజేశారు.అలాగే స్టార్టప్స్ యువతలో సృజనాత్మకతను, ఆవిష్కరణను ప్రోత్సహిస్తాన్నాయిని తెలిపారు.ఈ కార్యక్రమానికి మరో గౌరవ అతిథిగా డి.మురళీకృష్ణ గారు,సి.ఎస్.సి విభాగాధిపతి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం నుండి ఇచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సాంకేతిక ఉత్సవం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది మరియు జ్ఞానం,నైపుణ్యం,నాయకత్వం,ఆత్మవిశ్వాసం అన్నీ ఒకే వేదికపై అభివృద్ధి చెందుతాయిని తెలియజేశారు.ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ఈ ఉత్సవం ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మకతను,సాంకేతిక నైపుణ్యాలను మరియు పరిశోధనా సామర్థ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారని తెలుపుతూ కాలేజీ ఎల్లప్పుడూ నూతన ఆవిష్కరణలకు,సాంకేతిక ప్రగతికి దోహదం చేస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి కీనోట్ స్పీకర్ గా డాక్టర్ ఏ.పద్మజ గారు,ఈఈఈ విభాగాధిపతి జేఎన్టీయూ గురజాడ,విజయనగరం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి ప్రజల వరకు చేరుకునే విధానంపై ఉపన్యాసం ఇచ్చారు.ఈ సాంకేతిక ఉత్సవంలో పాల్గొన్న విద్యార్థులు ప్రదర్శించిన ఉత్తమ ప్రాజెక్టులు,పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్,పోస్టర్ ప్రజెంటేషన్స్,టెక్నికల్ క్విజ్ లకు బహుమతులు మరియు ప్రశంసాపత్రాలు అతిధులు చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు,బోధనేతర సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.




