స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు,సమాజ అభివృద్ధికి కూడా ముఖ్యమైన ఆధారం.అలాగే తల్లి, ఉపాధ్యాయురాలు,శాస్త్రవేత్త,నాయకురాలు వంటి అనేక పాత్రలలో మహిళలు విశేష కృషి చేస్తూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలియజేసారు.మరియు కష్టపడి పనిచేస్తే మహిళలు ఏ రంగంలోనైనా అగ్రస్థానాన్ని సాధించగలరని తెలియజేసారు.మహిళల పట్ల గౌరవం,సమానత్వం మరియు సహకారం అనే విలువలను మన జీవితంలో పాటిస్తూ ముందుకు సాగాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు,విద్యార్థిణిలు,బోధనేతర సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ చీపురుపల్లి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా కూటమి ప్రభుత్వం