*విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో అభివృద్ధి చెందిన నూతన న్యూరోసర్జరీ పరికరం పై పరిశోధనకు గుర్తింపువిజయనగరం, మార్చి 17, 2026 – ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ & ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం, న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెడ్డి శంకరరావు, ఎంబిబిఎస్ విద్యార్థి వి. డానీ మార్చి 16, 2026న జిటామ్ ఫౌండర్స్ సమ్మిట్‌లో ప్రధాన పరిశోధకులుగా, సహ-పరిశోధకులుగా పాల్గొన్నారు. వారు “సర్జన్-లెడ్ నోవెల్ క్రానియోటోమ్ అడాప్టర్ టు కన్వర్ట్ సర్టిఫైడ్ ఇంటి/డెంటల్ డ్రిల్ సిస్టమ్ ఇంటూ ఎ న్యూరోసర్జరీ డ్రిల్ సిస్టమ్” అనే వినూత్న పరిశోధనను సమర్పించారు.ఈ పరిశోధన వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరసమైన న్యూరోసర్జికల్ పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించింది. ఈ సమ్మిట్‌లో వారి పరిశోధనకు అనేక గుర్తింపులు లిబించాయి:– పిచ్ డెక్ ప్రెజెంటేషన్‌లో ఓవరాల్ రన్నర్-అప్ అవార్డు, ₹35,000 నగదు బహుమతి– ఈవెంట్‌లో ప్రదర్శించబడిన టాప్ 8 వెంచర్‌లలో ఒకటిగా ఎంపికఈ విజయం వైద్య పరిశోధనల్లో కళాశాల అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. పరిశోధన అభివృద్ధికి, సంస్థ ప్రతిష్టకు దోహదపడినందుకు వి. డానీ సమ్మిట్‌లో పాల్గొనడానికి కళాశాల అధికారులు డా. బి. దేవి మాధవి. ప్రిన్సిపాల్ జి. ఎం. సి… డా. ఏ. పద్మజ. సూపర్న్డెంట్, జి. జి. హ్చ్, వైస్ ప్రిన్సిపాల్. కళాశాల సిబ్బంది అభినందించారు. Spread the love టపా నావిగేషన్ ఏపీ రెరా అవగాహన సదస్సు రెవెన్యూ అంశాల పరిష్కారంలో జాప్యం వద్దుజాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ ఆదేశం