ఈరోజు ఉదయం స్థానిక పశువైద్య కళాశాల నందు విద్యార్థులకు టీబీ వ్యాధిపై అవగాహన సదస్సును డాక్టర్ రాజ్యలక్ష్మి గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,గరివిడి వారు మరియు జి లలిత గారు “టీబీ వ్యాధి” సూపర్వైజర్, చీపురుపల్లి సర్కిల్ వారి ఆధ్వర్యంలో పశు వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఇంటర్నెట్ షిప్ కో-ఆర్డినేటర్ అధికారి డాక్టర్ బి ప్రకాష్ కుమార్ మరియు ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ గంగు నాయుడు, డాక్టర్ మనోజ్ కుమార్ డాక్టర్ రవికుమార్ పాల్గొని విద్యార్థులకు క్షేత్రస్థాయిలో చేయవలసిన పనులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం అనంతరం నాలుగో సంవత్సరం వెటర్నరీ వైద్య విద్యార్థులకు “రాబిస్ వ్యాధి” రాకుండా, నియంత్రణ కొరకు మూడవ డోసు టీకాను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి గరివిడి పశువైద్య కళాశాల విద్యార్థులు నాన్ టీచింగ్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు Spread the love టపా నావిగేషన్ దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు