*కర్లాం గ్రామంలో విజయనగరం జిల్లా వైస్సార్ పార్టీ పబ్లిసిటీ వింగ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం నకు విశేషా ఆదరణ*మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో, గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా*ఉచిత మెగావైద్య శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ బొత్స అనూష* అధిక సంఖ్యలో పాల్గొన్న హృదరోగులు విజయనగరం జిల్లా వైస్సార్ పార్టీ పబ్లిసిటీ వింగ్ ఆధ్వర్యంలో చీపురుపల్లి మండలం, కర్లాం గ్రామంలో రాగోలు జెమ్స్ హాస్పటల్ వారి ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్, బాణాన భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు బాణాన రామరత్నం రమణ పర్యవేక్షణలో ఉచిత మెగా వైద్యశిభిరం నిర్వహించారు ఈ మహత్తర కార్యక్రమానికి వైస్సార్ మండల స్థాయి నాయకులుపాల్గొని ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తనయరాలు, యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మరియు మారుమూల గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం చేరువైనప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యమవుతుంది. ఇటువంటి ఉచిత శిబిరాలు సామాన్యులకు ఒక వరప్రదాయిని. నిస్వార్థంగా సేవలందిస్తున్న వైద్య సిబ్బంది అభినందనీయులు,” అని పేర్కొన్నారు. వైద్య వృత్తి పట్ల తనకున్న అవగాహనతో ఆమె రోగుల అవసరాలను అడిగి తెలుసుకోవడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది.జేమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ వెంకటేష్ (జనరల్ మెడిసిన్ ), డాక్టర్ సాయి తేజ (కార్డియాలజిస్ట్ ), డాక్టర్ సునీల్ (ఆర్తో ) వారి పర్యవేక్షణలో ఈ శిబిరంలో అత్యాధునిక పరికరాలతో నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి డాక్టర్ అనూష చేతుల మీదుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జెమ్స్ ఆసుపత్రి నిపుణులైన వైద్యులు వివిధ విభాగాల్లో రోగులను పరీక్షించి తగిన సలహాలు సూచనలు అందజేశారు. ఈ వైద్య శిభిరం లో హార్ట్ కి సంబందించిన ఈసీజీ , 2డి ఏకో పరీక్షలు ఉచితంగా చేశారు , ఈ వైద్యశిభిరం లో గుండె సంబంధిత సమస్యలు, కేన్సర్ సమస్యలు,కంటి సంబందించిన సమస్యలు, స్రీల సంబంధిత సమస్యలు,కీళ్ళ సమస్యలు, మరియు అన్ని రకాల సాధారణ వ్యాధులకు పరీక్షలు డాక్టర్స్ చే ఉచితంగా తనిఖీలు నిర్వహించారు ఈ వైద్య శిభిరంలో చూపించుకున్న పెషేంట్ లకు వైద్యుల సూచనలు మేరకు ఆపరేషన్ లు జెమ్స్ హాస్పటల్ రాగోలు (శ్రీకాకుళం)వారిచే ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులు అయిన వారికి ఉచితంగా ఆపరేషన్ లు చేయబడును అని పేషెంట్లకు వివరించారు ఈ శిబిరంలో సుమారు 450 మంది తనిఖీ చేసుకున్నట్లు తెలియజేశారు ఈ శిబిరం ప్రారంభోత్సవంలో బొత్స అనూష తో పాటు ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం, జడ్పిటిసి సభ్యులు వలిరెడ్డి శిరీష, జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు వల్లి రెడ్డి శ్రీనివాస నాయుడు, మాజీ జడ్పిటిసి సభ్యులు మీసాల వరాల నాయుడు, చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి శ్రీనివాస్, యువ నాయకులు బెల్లాన వంశీకృష్ణ, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దన్నాన జనార్ధన, బెల్లాన త్రినాధ, జేమ్స్ హాస్పిటల్ ఎం. సింహాచలం, ఏరియా మేనేజర్ ఎస్.రాంబాబు, పి ఆర్ ఓ. జి.అప్పలనాయుడు మండలంలోని వివిధ గ్రామాల ముఖ్య నాయకులు,సోషల్ మీడియా ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు Spread the love టపా నావిగేషన్ శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మవారికి పుట్టింటి సారే సమర్పించిన పాత కుమ్మరి వీధి వాసులు DRC సమావేశంలో చర్చించిన గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకట రావు