తమ్ముడు కొడుకే తుది ముట్టించాడు… నిందితులను రిమాండ్ కి తరలింపు.. చీపురుపల్లి మండలం గొల్లల పాలెం గ్రామం నాకు చెందిన గొర్లె చిన్నప్పమ్మ (68) అనే వృద్ధురాలు ని రెండు తులాల బంగారం కోసం సొంత మేనల్లుడే హత్య చేసి ఊరు చివర్లో గల చెరువులో పాతిపెట్టిన ఘటన మంగళవారం స్థానికంగా సంచలనం రేపింది. చీపురుపల్లి డి.ఎస్.పి.ఎస్ రాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శంకర్రావు ల సారాధ్యంలో ఈ సంఘటనకు సంబంధించి వివరించిన విషయాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి మండలం గొల్లల పాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు చిన్నప్పమ్మ ఫిబ్రవరి నెల 23న ఇంటి నుండి కనబడకుండా పోయినట్లు ఆమె కుమార్తె అల్లుడు రెడ్డి పాపినాయుడులు ఫిబ్రవరి 27న చీపురుపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 23 నుండి కనబడకుండా పోయిన చిన్నప్పమ్మను బంధువుల , తెలిసిన కుటుంబాల వద్ద ఆ నెల 26 వరకు వెతక సాగారు. ఈ క్రమంలో మృతురాలు సొంత మేనల్లుడైన ఎజ్జపురపు రమణ, అదే గ్రామానికి చెందిన చందకరమన కదలికల పైన గ్రామస్తులకు అనుమానం రావడంతో పోలీసులు ఆఫీసులో దర్యాప్తును కొనసాగించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించగా తామే ఈ హత్యకు పాల్పడినట్లు అంగీకరించడంతో మంగళవారం నాడు నిందితులతో పాటు శవాన్ని పాతిపెట్టిన స్థలానికి పోలీస్, అధికారులు, రెవెన్యూ, క్లూస్ బృందం తో పాటు ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ పోలీస్ లేబరేటరీ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. బంధువుల సమక్షంలో మృతురాలని గుర్తించి హత్యా నేరముగా పరిగణించారు. పోలీసుల కథనం మేరకు ఫిబ్రవరి 23న మృతురాలిని ఇంటిలోనే సొంత మేనల్లుడైన ఎజ్జిపురపు రమణ, చందకర రమణ ఇద్దరు కలిసి మృతురాల్ని హత్య చేసి ఫ్లెక్సీల కవర్లో చుట్టి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల చెరువులో పాతిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. తమకున్న సమాచారం మేరకు ఇద్దరు నిందితులను కూడా రణస్థలం వద్ద అరెస్టు చేశామని సిఐ వివరించారు. ప్రాథమిక సమాచారం మేరకు నిందితులు దొంగిలించిన బంగారం తో పాటు, వారికి ఎవరెవరు సహకరించారు అనే అంశం పైన కూడా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. వ్యసనాలకు అలవాటు పడి ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు సీఐ శంకర్రావు ఆధ్వర్యంలో చీపురుపల్లి ఎస్సై దామోదర్ రావు, గరివిడి ఎస్సై లోకేష్, బుధ రాయవలసి ఎస్ఐ లోకేష్, గుర్ల ఎస్ఐ నారాయణరావు, పోలీస్ సిబ్బంది స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ డి ధర్మరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు… Spread the love టపా నావిగేషన్ కంచె చేను మేస్తే