ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి విచ్చేసిన పట్టాభి గారికి ఘనంగా స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ అధికారి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మరియు చీపురు పల్లి నియోజకవర్గం నాయకులు.అనంతరం జరిగిన సమావేశంలో పట్టాభి రామ్ మాట్లాడుతూ స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర మిషన్లో భాగంగా విజయనగరం జిల్లాకు సుమారు 69 కోట్ల నిధులతో ట్రాలీలు పంపిణీ కార్యక్రమం జరిగింది.. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ లో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్ గాని ఇండివిడ్యుయల్ టాయిలెట్స్ గాని ఎన్ని కావాలన్నా మంజూరు చేసే విధంగా ప్రభుత్వం ముందుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్న డ్రైనేజ్ సమస్యకు మ్యాజిక్ ట్రైన్ వాల్ పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయమని అధికారులకు ఆదేశించారు.స్థానిక ఎమ్మెల్యే కళా వెంకట్రావు గారి ఆదేశాలతో ఈ ప్రాజెక్టు ముందుకు పైలెట్ ప్రాజెక్టుగా చేపడతారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్య మొక్కజొన్నకు సరైన మద్దతు లేకపోవడంతో చీపురుపల్లి నియోజకవర్గం నాయకులు మరియు రైతులు అందరూ తెలియచేశారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చే దిశగా చంద్రబాబునాయుడు గారు అడుగులు వేస్తున్న తరుణంలో బ్యాగ్స్ తయారీలో మొక్కజొన్న వాడే విధంగా ప్రాసెసింగ్ యూనిట్ స్థానిక ఎమ్మెల్యే కళా వెంకట్రావు గారు చోరవతో మరియు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు గారి చొరవతో దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. . స్వచ్ఛ్ ఆంధ్ర బళ్ళు ప్రజల వద్దకే వెళ్లి తాము వాడి పడేసే వేస్ట్ వ్యర్థాలకు తగిన రూపంలో సరుకులు తీసుకునేందుకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. .. దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వాధికారులది నాయకులది అని అన్నారు. Spread the love టపా నావిగేషన్ ఎమ్మెల్యే పై తప్పుడు కథనం ప్రసారం చేసిన ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తాం..