సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్,వైసీపీ అభిమాని కర్రి.పోలారావు గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో భాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతిచెందారు. ఈ విషయం తెలిసిన *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర* గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం సాలూరు పట్టణంలోని డబ్బివీధిలో ఉన్న పోలారావు గారి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పోలారావు గారికి ఘనంగా నివాళులర్పించారు. Spread the love టపా నావిగేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా,ను మర్యాదపూర్వకంగా కలిసిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, మెప్మా ఆధ్వర్యంలో ఎగ్ కార్ట్స్ ను పంపిణీ చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి