ఈ రోజు సాలూరు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ హై స్కూల్‌లో కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాల్య వివాహాల నిషేధ చట్టం (Prohibition of Child Marriage Act), పోక్సో చట్టం (POCSO Act), విద్యా హక్కు చట్టం (Right to Education Act)లపై అవగాహన కల్పించబడింది.
విద్యార్థులకు బాల్య వివాహాల ప్రమాదాలు, బాలల రక్షణకు ఉన్న చట్టపరమైన హక్కులు, అలాగే విద్య యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ అప్పలనాయుడు ఐసీడీఎస్ అధికారులు, సీడీపీవో శ్రీమతి బి. మంగవేణి , ఐసీడీఎస్ జిల్లా కౌన్సిలర్ శ్రీ జి. తవిటినాయుడు , విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి