పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన *“మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ – 4.0”* లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.

“తల్లికి వందనం” పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం అందిస్తూ ప్రభుత్వం విద్యకు భరోసా కల్పిస్తోంది అని

సాలూరు నియోజకవర్గం: 30,146 మంది పిల్లలు – 22,348 మంది తల్లుల ఖాతాలలో రూ.45.21 కోట్లు.

కురుపాం నియోజకవర్గం: 33,029 మంది పిల్లలు – 23,369 మంది తల్లుల ఖాతాలలో రూ.49.54 కోట్లు.

పార్వతీపురం నియోజకవర్గం: 22,711 మంది పిల్లలు – 16,840 మంది తల్లుల ఖాతాలలో రూ.34.07 కోట్లు.

పాలకొండ నియోజకవర్గం: 26,905 మంది పిల్లలు – 18,486 మంది తల్లుల ఖాతాలలో రూ.27.73 కోట్లు.

పార్వతీపురం మన్యం జిల్లా మొత్తం: 1,15,001 మంది పిల్లలు – 81,598 మంది తల్లుల ఖాతాలలో – రూ.172.50 కోట్లు.

రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో : 5,08,609 మంది పిల్లలు – 4,57,881 మంది తల్లులు ఖాతాలలో రూ.648.80 కోట్లు.

ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా తల్లుల ఖాతాల్లో రూ.10 వేల కోట్లకు పైగా జమ చేశామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

“తల్లికి వందనం” వంటి విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచే సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

పాఠశాలలో విద్యా వాతావరణాన్ని పరిశీలించిన మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజన నాణ్యత, పరిశుభ్రత, అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

పిల్లలు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నప్పుడు వారు ఏమి చూస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని, వారి చదువుపై దృష్టి పెట్టేలా మార్గనిర్దేశం చేయాలని మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు.ప్రతి విద్యార్థి పెద్ద లక్ష్యాలను పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం సమిష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి