*విజయనగరం, జూలై 9:* విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో *గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల సముద్రంలో గల్లంతైన మత్స్యకారులకు జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను గారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సభలో సభ్యులతో కలిసి రెండు నిమిషాల మౌనం పాటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జిల్లా ప్రజా సమస్యలపై జరిగిన చర్చలో చిన్న శ్రీను గారు మాట్లాడుతూ, జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న అత్యంత ముఖ్యమైన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి కూటమి ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడం బాధాకరమని అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులు సమావేశాలకు దూరంగా ఉండటం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులు ఎరువులు, విత్తనాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీటి సమస్యల కారణంగా పలు ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు పడుతున్న ఇబ్బందులను సమావేశంలో ప్రస్తావించారు. అదేవిధంగా రెండేళ్లుగా హౌసింగ్, సామాజిక భద్రతా పెన్షన్ల కోసం వేలాది మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని, ఉపాధి హామీ పథకం అమలులో చోటుచేసుకుంటున్న పలు అవకతవకలపై కూడా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. జిల్లా రైతాంగం, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చిన్న శ్రీను సూచించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. రామసుందర్ రెడ్డి , మన్యం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రభాకర్ రెడ్డి , జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) శ్రీమతి ఈ. నాగలక్ష్మి , ఎమ్మెల్సీ శ్రీ ఇందుకూరి రఘురాజు , జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించి, ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలపై సమీక్ష నిర్వహించారు. Spread the love టపా నావిగేషన్ అంతర్జాతీయ విమానశ్రయానికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాం విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి,ఐపిఎస్