విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయంను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపిఎస్ గారితో కలిసి విశాఖపట్నం రేంజ్ ఐజిపీ, గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ సందర్శించి కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నట్లుగా జూలై 8న తెలిపారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఎయిర్ పోర్టు అధికారులతో విశాఖపట్నం రేంజ్ ఐజిపి ఎయిర్ పోర్టును, ప్రాంగణంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్, ఎ.టి.సి., బ్యాగేజ్, ఇతర లాంజ్ లను సందర్శించి, భద్రత ఏర్పాట్లును సమీక్షించారు. ఏ భవనంలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించనున్నది ఎయిర్ పోర్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఎయిర్ పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పవర్ పాయింట్ ప్రెజెంటేషనుతో చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లును సమీక్షించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ ఐజిపి శ్రీ గోపీనాథ్ జట్టి గారు మాట్లాడుతూ – భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ త్వరలో ప్రారంభంకానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లును సమీక్షించామన్నారు. ఒక సం.లో సుమారు 4కోట్ల మంది ప్రయాణికులు విమానయాన ప్రయాణం చేసే అవకాశం ఉంటుందన్న అంచనాతో భద్రత ఏర్పాట్లును చేస్తున్నామన్నారు. విమానశ్రయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు అంతర్గత భద్రత కల్పిస్తున్నప్పటికి విమానశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చేయడం, ముఖ్య వ్యక్తుల భద్రతకు చర్యలు చేపట్టడం, వాహనాల రాకపోకలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టడం, దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా భద్రత కల్పించడం, అనుమానస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం వంటి విషయాలపై ప్రధానంగా దృష్టి పెడతామని విశాఖపట్నం రేంజ్ ఐజిపి గోపీనాథ్ జట్టి అన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్ గారు మాట్లాడుతూ – భోగాపురం ఎయిర్ పోర్టుకు అవసరమైన కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తామన్నారు. ఎయిర్ పోర్టు ప్రాంగణంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్, ఎ.టి.సి, లాంజ్ లను, బ్యాగేజ్, ఇతర భవనాలను సందర్శించి, ఏ భవనంలో ఏ తరహా కార్యకలాపాలు నిర్వహించేది ఎయిర్ పోర్టు అధికారులను అడిగి తెలుసుకొని, భద్రతను సమీక్షించామన్నారు. విమానశ్రయం పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలను పరిరక్షించడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, నేరాలు జరగకుండా చూడడం, అనుమానస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా పెట్టం, ఇతర భద్రత సంస్థలైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీఫోర్సు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఎయిర్పోర్టు అధార్టీ ఆఫ్ ఇండియా అధికారులు, ఇంటిలిజెన్సు, అగ్నిమాపక శాఖ, వైద్య బృందాలతో సమన్వయంతో పని చేయడం, విమాన ప్రయాణాలు చేసే ముఖ్య వ్యక్తుల భద్రత కల్పించడం, విమానాశ్రయ ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో వాహనాల రద్దీని నియంత్రించడం, అత్యవసర పరిస్థితుల్లో స్పందిచండం, ప్రమాదాలు జరగకుండా చూడడం, బెదిరింపులకు తక్షణ చర్యలు చేవట్టడం, దేశ భద్రతకు సంబంధించిన చట్టాలు, స్థానిక చట్టాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. ఈ సమీక్షలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఎస్.రాఘవులు, జి.ఎం.ఆర్., ఎల్ అండ్ టి, ఎయిర్ పోర్ట్ అధికారులు, పలువురు సిఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు వదంతులు నమ్మవద్దు