విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను ఆగస్టు 1న జిల్లాకు విచ్చేసిన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గార్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గార్ని, రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ గార్ని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గార్ని, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మరియు విద్యాశాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ గార్ని, కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గార్ని జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్ గారు మర్యాద పూర్వకంగా కలిసి సాదర స్వాగతం పలికారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పర్యటనను విజయవంతం చేసినందుకు జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్, జిల్లా కలెక్టరు శ్రీ ఎస్.రామసుందర రెడ్డి, ఐఏఎస్ సమన్వయంతో పని చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 1న ఇరువురిని ప్రశంసలతో ముంచెత్తారు. భవిష్యత్తులో కూడా ఇరువురు ఇదే స్ఫూర్తితో పని చేయాలన్నారు.అదే విధంగా రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీసుశాఖ కూడా సమర్ధవంతంగా పని చేస్తుందని రాష్ట్ర డీజీపీ గారి పని తీరును రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి