🔴 బ్రేకింగ్ న్యూస్ వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కంటతడి చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్సీపీ నేతల ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇటీవల తన మేనల్లుడు చిన్న శీను వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన నేపథ్యంలో బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు జిల్లా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సమావేశానికి హాజరైన పార్టీ క్యాడర్‌ను చూసి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టినట్లు తెలుస్తోంది. క్యాడర్‌కు అండగా ఉంటానంటూ బొత్స భరోసా ఇచ్చినట్లు సమాచారం. Spread the love టపా నావిగేషన్ చీపురుపల్లి లో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక ఏర్పాట్లు