గాజువాక, జూలై 19: విశాఖ జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు పేర్ల నూకరాజు ఆధ్వర్యంలో ఆదివారం గంగవరంలో మత్స్యకారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా, రాష్ట్ర, జాతీయ మత్స్యకార సంఘాల నాయకులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా జీవీఎంసీ పశ్చిమ,ఉత్తర జోన్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు కారి గోవిందరాజు మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా మారినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. విద్యతో పాటు సామాజిక, రాజకీయ చైతన్యం కూడా అవసరమని పేర్కొన్నారు.గతంలో టీడీపీ జీవీఎంసీ ఎన్నికల్లో ఇద్దరు మత్స్యకారులకు పోటీ చేసే అవకాశం కల్పించిందని గుర్తు చేసిన ఆయన, అయితే మత్స్యకార కుటుంబాలు వారిని గెలిపించుకోలేకపోయామని అన్నారు. స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధుల పదవుల్లో మత్స్యకారులకు ప్రాతినిధ్యం లభించినప్పుడే వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి సమర్థంగా తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకే మత్స్యకారులు ఐక్యంగా ఉండి తమ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.సదస్సులో జాతీయ మత్స్యకార సంఘం చైర్మన్ నందకుమార్, రాష్ట్ర మత్స్యకార అధ్యక్షుడు మోస అప్పలరాజు, ఎన్ ఎ ఎఫ్ కార్యదర్శి నగేష్ బాబు, బెస్త కార్పొరేషన్ డైరక్టర్ మల్లికార్జున ఎన్ఎఎఫ్ వర్కింగ్ చైర్మన్ ప్రభాకర్, రిటైర్డ్ మిజిస్ట్రేట్ గింకా శేఖర్ లు ముఖ్య అతిధులుగా పోలుగోన్ని మాట్లాడారు, మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకార పడవకు ఆధునిక జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు, ఉపగ్రహ (శాటిలైట్) ఆధారిత ట్రాకింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న మత్స్యకారులను వెంటనే గుర్తించి సహాయక చర్యలు చేపట్టే విధంగా ప్రత్యేక వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.అలాగే మత్స్యకారుల సంక్షేమ పథకాలను మరింత విస్తరించాలని, బీమా సౌకర్యాలు, ఆధునిక వేట పరికరాలు, సబ్సిడీపై డీజిల్, మౌలిక వసతులు కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. మత్స్యకారుల హక్కుల పరిరక్షణకు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ మత్స్యకార సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ చీపురుపల్లి లో 88 రోజుల్లోనే పేదవాడి సొంతింటి కల సాకారం చేసిన కూటమి ప్రభుత్వం