మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై విస్తృతమవుతున్న పోలీసు తనిఖీలు*

మద్యం సేవించి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తున్న న్యాయ స్థానాలు.గడిచిన మూడు నెలలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని తెలిపిన జిల్లా ఎస్పీ ఒక్క రోజునే డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షలు జరిమానాగా చెల్లించిన 53 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి గారు విధించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఫిబ్రవరి 26న తెలిపారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సిఐ సూరి నాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, మద్యం సేవించి, వాహనాలు నడిపిన వారిపై 53 కేసులు నమోదు చేసి, విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరుపర్చగా, మెజిస్ట్రేట్ శ్రీ ఎం.ఎస్.హెచ్. ఆర్. తేజ చక్రవర్తి గారు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున మొత్తం 53 మందికి రూ. 5.30 లక్షలను జరిమానగా విధించారని జిల్లా ఎస్పీ తెలిపారు.

మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవ్వడం లేదా ఇతర వాహనాలను ఢీ కొట్టి ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. ఈ తరహా వాహనదారులను కట్టడి చేసేందుకు, ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రతీ రోజూ నిర్వహిస్తున్న విజిబుల్ పోలీసింగులో భాగంగా ప్రత్యేకంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతూ, మద్యం సేవించి, వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. గడిచిన మూడు నెలలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని తెలిపిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి