చీపురుపల్లి మండలం, గొల్లలములగం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు  పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గుణుపూరు మహాలక్ష్మి  ఇంటికి వెళ్లి అతడు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేయించుకుంటున్న గుణుపూరు మహాలక్ష్ము గారికి, వృద్ధాప్య పెన్షన్ రూ. 4,000/- స్థానంలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు పెంచిన రూ. 10,000/- ల డయాలసిస్ పెన్షన్‌ను రామ మల్లిక్ నాయుడు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “గతంలో మీకు వృద్ధాప్య పెన్షన్ 4 వేలు వచ్చేది. కానీ ఇప్పుడు మీకు కిడ్నీ సమస్య వచ్చి డయాలసిస్ కి వెళ్తున్నారు కాబట్టి, మీ వైద్య ఖర్చుల కోసం చంద్రబాబు నాయుడు  ఈ నెల నుంచి మీకు పదివేల రూపాయల పెన్షన్ (₹10,000/-) ఇస్తున్నారు. కష్టకాలంలో ఆదుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి” అని భరోసా కల్పించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి