దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం: చీపురుపల్లిలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు పేర్కొన్నారు. చీపురుపల్లి బస్టాండ్ నందు ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళా వెంకటరావు గారు స్వయంగా దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో కొద్ది దూరం ప్రయాణించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…“దివ్యాంగుల సాధికారత కోసమే ఈ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉంది. దివ్యాంగులు ఆత్మగౌరవంతో, ఎవరిపైనా ఆధారపడకుండా జీవించేలా ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడమే మా లక్ష్యం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆర్టీసీ అధికారులు మరియు పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్ష టీబీ వ్యాధిపై అవగాహన సదస్సును