స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం (జలమే జీవం) లో భాగంగా సాలూరు పట్టణంలోని KH స్కూల్ వాడది కోనేటి గట్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.మంత్రి మాట్లాడుతూ: పార్లమెంటులో మహిళా నారీశక్తి బంధన్ అభియాన్ బిల్లు ప్రవేశపెట్టడం దేశంలోని యావత్ మహిళా లోకం గర్వించే చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం మహిళా సాధికారతకు దారితీసే కీలక అడుగు.మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే దేశ ప్రగతి మరింత వేగవంతం అవుతుందని ప్రధాని లక్ష్యంతో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అని మంత్రి తెలిపారు.మహిళల అభివృద్ధి, సమాన హక్కుల కోసం తీసుకొస్తున్న ఇలాంటి కీలక బిల్లులకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు దోహదపడే కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రివర్యులు అన్నారు. మహిళల అభివృద్ధి విషయంలో రాజకీయ లాభనష్టాల కంటే దేశ ప్రయోజనాలు, మహిళల భవిష్యత్తు ముఖ్యం అని సూచించారు.స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రతతో పాటు నీటి వనరుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు.“జలమే జీవం” అనే భావనతో ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించాలని, భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలని సూచించారు.ప్రజలు, యువత, మహిళలు కలిసి పరిశుభ్రత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. Spread the love టపా నావిగేషన్ అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం