ప పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీని తెరిపించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు కు స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్, మెడికల్ కాంట్రాక్టర్ వర్కర్స్ అసోసియేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ బలగ.రాధా నాయుడు వినతిపత్రం అందచేశారు .అనంతరం ఆమె మాట్లాడుతూ జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ గత మూడు సంవత్సరాల నుండి మూసివేయడం వలన బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు 2000 కుటుంబాలు, అందురో ఎక్కు వ శాతం మహిళలు ఉపాది కోల్పోవడంతో వారి యొక్క జీవన ఉపాధి కష్టంగా మారిందన్నారు. వారి యొక్క కుటుంబ పరిస్థితి అర్థం చేసుకొని జూట్ మిల్లు తెరిపించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరడం జరిగిందన్నారు.అలాగే ఆసుపత్రిలో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని జీవో నెంబర్ 138 ప్రకారం 18,600 వేతనానికి సంబంధించి పిఎఫ్ ఈఎస్ఐ పోను 13897 రూపాయల వేతనాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరడం జరిగిందన్నారు.ఈ విషయాల పై మంత్రి స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి తన వంతు సహాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ బంగారమ్మపేటలో ఘనంగా శ్రీశ్రీశ్రీ కుండలపోలమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవం