సాలూరు నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి గిరిజన గ్రామాల నుండి వైసిపీని వీడి టీడీపీలోకి జోరుగా వలసలు కనసాగుతున్నాయి.ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రి సంధ్యారాణి కి మహిళలు, కార్యకర్తలు, నాయకులు మరియు గ్రామస్తులు మేళతాళాలతో, థింసానృత్యాలు చేస్తూ పూలవర్శంతో గ్రామంలోకి ఆహ్వానించారు.పాంచాలి పంచాయితీ పెద జీలుగువలస, సీతంపేట గ్రామాలు నుండి మండల అధ్యక్షులు యుగంధర్ అధ్యక్షతన మాజీ ఎంపీటీసీ గెమ్మెల గంగన్నదొర ఆధ్వర్యంలో 250 కుటుంబాలు వైసిపి పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరారు గెమ్మెల గంగన్న దొర గారికి, వార్డు మెంబర్లు తదితరులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సంధ్యారాణి అందరూ కలిసి ఇంటింటికి తిరుగుతూ, సంక్షేమ పథకాలను వివరిస్తూ, సందడిగా వారితో భోజనం చేసిన మంత్రి సంధ్యారాణి.రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో మంత్రి సంధ్యారాణి గారు నిరంతరం ప్రజాదర్బార్ నిర్వహిస్తు, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ, నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చూసి టీడీపీ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.50 సంవత్సరాలకే గిరిజనులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని మంత్రి అన్నారు.పార్టీలో చేరిన వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని, సంక్షేమం, అభివృద్దే టిడిపి పార్టీ ధ్యేయమని, తెలిపిన మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. Spread the love టపా నావిగేషన్ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి సంధ్యారాణి పాచిపెంట మండలంలో ₹53 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మండల విద్యాశాఖ (MEO) కార్యాలయ భవనాన్ని మంత్రి సంధ్యారాణి