*మన్ కీ బాత్ లో అభినందించిన ప్రధాని మోదీ* విజయనగరం, జూలై 26: జిల్లాకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలో చేపట్టిన జలధార – జలహారతి పనులను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆదివారం ప్రసారమైన అత్యంత ప్రజాదరణ పొందిన “మన్ కీ బాత్” రేడియో కార్యక్రమంలో విజయనగరం జిల్లాలో చేపట్టిన ‘జలధార–జలహారతి’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. వీటిని ఆదర్శంగా తీసుకొని జలవనరుల పునరుద్ధరణకు కృషి చేయాలని ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సాంప్రదాయ జలాశయాల పునరుద్ధరణలో జిల్లా యంత్రాంగం మరియు ప్రజలు సాధించిన ప్రగతిని ప్రధాని దేశానికి చాటిచెప్పడం పట్ల జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి జలధార – జలహారతి కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువులు, వాగులు, కుంటల పునరుద్ధరణ లక్ష్యంగా అధికారులను పరుగులు పెట్టించారు. అంతేకాకుండా తాను సైతం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, యంత్రాంగంలో స్ఫూర్తిని నింపారు. దీంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, భూగర్భ జల శాఖ అధికారుల సమన్వయం మరియు ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సమిష్టి కృషితో ఈ విజయం సాధ్యమైంది. దేశ అత్యున్నత నాయకత్వం నుండి తమ పనులకు గుర్తింపు లభించడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని, ఈ ప్రశంస భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ, జల సంరక్షణ కార్యక్రమాలను చేపట్టేందుకు మరింత ప్రేరణనిస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొంటూ, ఈ పనుల నిర్వహణలో భాగస్వాములైన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. ………. *జిల్లాలో జలధార – జలహారతి పనుల వివరాలు :* 1. పనుల పురోగతి గుర్తించినవి: మొత్తం 8,995 (కాలువలు: 2,549 | సూక్ష్మనీటి వనరుల చెరువులు: 6,446) మంజూరైనవి: మొత్తం 8,995 (కాలువలు: 2,549 | సూక్ష్మనీటి వనరుల చెరువులు: 6,446) ప్రారంభించినవి (గ్రౌండ్ అయినవి): మొత్తం 8,991 (కాలువలు: 2,549 | సూక్ష్మనీటి వనరుల చెరువులు: 6,442) పూర్తయినవి: మొత్తం 8,973 (కాలువలు: 2,549 | సూక్ష్మనీటి వనరుల చెరువులు: 6,424) 2. ఖర్చు వివరాలు కాలువల ఖర్చు: రూ. 21.40 కోట్లు సూక్ష్మనీటి వనరుల చెరువుల ఖర్చు: రూ. 297.17 కోట్లు మొత్తం ఖర్చు: రూ. 318.57 కోట్లు సృష్టించిన పనిదినాలు: 1.28 కోట్లు 3. చేసిన పనులు – పూడికతీత & పిచ్చిమొక్కల తొలగింపు పూడికతీత: సూక్ష్మనీటి వనరుల చెరువులు: 99.13 లక్షల క్యూబిక్ మీటర్లు (రూ. 291.22 కోట్లు) కాలువలు: 10.77 లక్షల క్యూబిక్ మీటర్లు (రూ. 19.48 కోట్లు) మొత్తం పూడికతీత: 109.90 లక్షల క్యూబిక్ మీటర్లు (రూ. 310.70 కోట్లు) పిచ్చిమొక్కల తొలగింపు: సూక్ష్మనీటి వనరుల చెరువులు: 62.25 లక్షల చదరపు మీటర్లు (రూ. 5.94 కోట్లు) కాలువలు: 20.23 లక్షల చదరపు మీటర్లు (రూ. 1.93 కోట్లు) మొత్తం తొలగింపు: 82.48 లక్షల చదరపు మీటర్లు (రూ. 7.87 కోట్లు) 4. ముఖ్య ముఖ్యాంశాలు మొత్తం తొలగించిన పూడిక: 109.90 లక్షల క్యూబిక్ మీటర్లు మొత్తం పిచ్చిమొక్కలు తొలగించిన విస్తీర్ణం: 82.48 లక్షల చదరపు మీటర్లు మొత్తం ఖర్చు: రూ. 318.57 కోట్లు పూడికతీసిన కాలువల పొడవు: 2,090 కిలోమీటర్లు. *భూగర్భ జలాల పెంచేందుకు:* జిల్లాలో 8-20 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్న 214 గ్రామాలు గుర్తించబడ్డాయి. 193 గ్రామాల్లో జలధార పనులు ప్రారంభమై, 596 ఫీడర్ ఛానల్స్ మరియు 1,767 ఎంఐ ట్యాంకులు కవర్ చేయబడ్డాయి. 25.63 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత తొలగించగా, భూగర్భ జల మట్టం సగటున 0.048 మీటర్లు పెరిగే అవకాశం ఉంది. Spread the love టపా నావిగేషన్ ప్రధాన మంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు -విశాఖపట్నం రేంజ్ ఐజిపి, శ్రీ గోపీనాథ్ జట్టి,ఐపిఎస్