జిల్లాలో మూతపడిన పరిశ్రమలు తెరవాలి. ముఖ్యమంత్రికి సిఐటియు విజ్ఞప్తి. ప్రచురణార్థం;- విజయనగరం జిల్లాలో సుమారు 25 పరిశ్రమలు మూతపడిన కారణంగా 15 వేలమంది కార్మికులకు ఉపాధి పోయిందని, గత 5 సంవత్సరాల క్రితమే పరిశ్రమలు ఏర్పాటు కోసం 3000 ఎకరాలు సేకరించారని, ఇప్పటికీ ఒక్క పరిశ్రమ కి శంకుస్థాపన జరగలేదని ఫిబ్రవరి 28న విజయనగరం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు వీటిపై స్పష్టమైన ప్రకటన చేసే విధంగా తెలుగుదేశం కూటమి పెద్దలు కృషి చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. గురువారం ఉదయం కేఎల్ పురం సిఐటియు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వలస ల్లో అగ్ర భాగాన, అభివృద్ధి, ఉపాధి కల్పనలో చివరి స్థానంలో విజయనగరం జిల్లా ఉందన్నారు. జిల్లాలో పరిశ్రమల మూత పరంపర కొనసాగుతుందని గరివిడి ఫేకర్, గర్భం ఆంధ్ర ఫెర్రో ఎల్లాయిస్, కొత్తవలస జిందాల్, బొబ్బిలి గ్రోత్ సెంటర్, చిన్నా పురం ఏ ఎస్ , కొత్తవలస ఉమా ,రాజాం లో 3 జ్యూట్ మిల్లు లు, భీమసింగి సుగర్స్ , గజపతి నగరంలో ఓలం తో సహా చిన్న చితకా పరిశ్రమ లు 25 మూతపడ్డాయి. ఫలితంగా 15000 మంది కి ఉపాధి పోయింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటనలో వీటిని తెరిపించటం పై స్పందించాలి. అదే విధంగా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో 308.49 , కొట్టక్కి లో 162.07 , కొండకిండాం లో 30.20, బలిగట్టాం లో 34.97, ఎస్ .కోట లో 1163.43, జిఎంఆర్ కు కొత్తవలస భోగాపురంలో 1140 ఎకరాల చొప్పున ఐదు సంవత్సరాల క్రితమే రైతుల వద్ద భూసేకరణ చేశారని, వాటిలో ఒక్క పరిశ్రమకు శంకుస్థాపన జరగలేదని, మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేల ఎకరాలని రైతుల దగ్గర నుంచి బలవంతంగా సేకరణకు ప్రయత్నిస్తుందని, ముఖ్యమంత్రి పర్యటనలో ఇప్పటికే సేకరించిన భూముల్లో పరిశ్రమల శంకుస్థాపన కోసం, జిల్లాలో యువతకు ఉపాధి కోసం కార్యచరణ ప్రకటించాలన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారి పై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పత్రిక విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే సురేష్, కోశాధికారి ఎ.జగన్ మోహన్ రావు, జిల్లా కార్యదర్శిలు వి. రాములు, బి.రమణ, సి హెచ్ వెంకటేష్ పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన