సునీత రెడ్డి విజయనగరం


విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో జూన్ 10న జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్* నిర్వహించి, దర్యాప్తులో ఉన్న లాంగ్ పెండింగు, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్.డి.పి.,ఎస్., పోక్సో, అట్రాసిటీ, మిస్సింగు, చోరీ, రోడ్డు ప్రమాద కేసులను, సోషల్ మీడియా కేసులను సమీక్షించి, అధికారులకు దర్యాప్తుపరమైన పలు సూచనలు చేసి, దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం చేసారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – రాష్ట్ర పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందించిన 360 డిగ్రీ మొబైల్ యాపులో మిస్సింగు, ఓ.వి. క్రిమినల్స్, పోయిన వాహనాల ఫోటోలను అప్లోడ్ చేసి, ఫేస్ రికగ్నైజింగు కెమెరాలతో వచ్చిన అలెర్ట్ మెసేజ్ లకు తక్షణమే స్పందించి మిస్సింగు, ఓ.వి.క్రిమినల్స్, పోయిన వాహనాల ఆచూకీని కనుగొనాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. స్మార్ట్ పోలీసింగుతో మెరుగైన సేవలను ప్రజలకు అందించాలని, క్షేత్ర స్థాయిలో సాంకేతికతను, డ్రోన్స్, సిసి కెమెరాల వినియోగాన్ని మరింత పెంచి, నేరాలను నియంత్రించాలన్నారు. మహిళల భద్రత, గంజాయి, రహదారి భద్రత, సైబరు భద్రత పట్ల ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. క్షేత్ర స్థాయిలో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో మహిళా సంరక్షణ పోలీసుల సేవలను వినియోగించుకోవాలన్నారు. చోరీ వస్తువులు, బంగారు ఆభరణాలను వ్యాపారులు కొనుగోలు చేయకుండా చర్యలు చేపట్టాలని, పాత బంగారు వస్తువులు కొనుగోలు చేసేందుకు బంగారు వ్యాపారులు ప్రత్యేకంగా ఒక రికార్డులో కొనుగోలు చేసే వస్తువుల వివరాలను నమోదు చేయాలన్నారు. ఏమైనా నేరాలు జరిగినపుడు నేర స్థలం నుండి ఆధారాల సేకరణకు తప్పనిసరిగా క్లూస్ టీం సహాయం తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో ఫోరెన్సిక్ సైన్స్ నివేదికలను సంబంధిత కార్యాలయాల నుండి త్వరితగతిన పొందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా పెట్టాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై పి.డి.యాక్టు ప్రయోగించాలన్నారు. ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నేరాలు జరగకుండా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. టెక్నాలజీతో కేసుల మిస్టరీని చేధించాలన్నారు. గంజాయి నియంత్రణ, మహిళల భద్రత, రహదారి భద్రత, సైబరు నేరాల నియంత్రణకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. గంజాయి వినియోగం వలన కలిగే దుష్పప్రభావాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలకు నిత్యం పోలీసులు అందుబాటులో ఉంటూ పోలీసు సేవలను విస్తృతం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణకు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో దత్తత కానిస్టేబుళ్ళు, మహిళా సంరక్షణ పోలీసుల (ఎం.ఎస్.పి) సేవలను వినియోగించుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. నేరాలు జరగకుండా రాత్రి గస్తీని, పెట్రోలింగును ముమ్మరం చేయాలని, నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దర్యాప్తు చేపట్టే అన్ని కేసుల్లోను ఈ-సాక్ష్య యాప్ ను వినియోగించాలని, ఫోటోలను, వీడియోలను ఈ-సాక్ష్యలో నిక్షిప్తం చేయాలన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో అభియోగ పత్రాలను నిర్దిష్ట సమయంలోగా ఆయా న్యాయస్థానాల్లో దాఖలు చేయాలన్నారు. మైనరు డ్రైవింగు, హెల్మెట్ ధారణ, డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగుపై ప్రత్యేక దృష్టి పెట్టి, కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.

వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న లాంగ్ పెండింగు కేసులను, ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులు, ఎన్డీపిఎస్, మిస్సింగు, మహిళలపై జరుగుతున్న దాడుల కేసులను, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్ఫోర్సుమెంటు కేసులను జిల్లా ఎస్పీ సమీక్షంచి, దర్యాప్తు పెండింగులో ఉండుటకుగల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తు పూర్తి చేయుటకు అధికారులకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ దిశా నిర్దేశం చేసారు.

ఈ నేర సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, డి.టి.పి.సి. డిఎస్పీ నారాయణరావు, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సీఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి