సునీత రెడ్డి విజయనగరం

బక్రీద్ పండగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు
*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*

గోవుల అక్రమ రవాణ నియంత్రణకు శాశ్వతంగా ఏర్పాటు చేసిన 5 చెక్ పోస్టులకు అదనంగా మరో 22 తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్న జిల్లా ఎస్పీ*

జిల్లా వ్యాప్తంగా 30 మూవింగ్ పార్టీలను ఏర్పాటు చేశామన్న జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపీఎస్*

*తనిఖీలను నిరంతరం పర్యవేక్షించేందుకు ముగ్గురు సిఐలను కమాండ్ కంట్రోల్ రూంలో నియమించామన్న జిల్లా ఎస్పీ*

బక్రీదు (ఈద్ అల్ ఆదా) పండగను మతసామరస్యానికి ప్రతీకగా కుల, మతాలకు అతీతంగా సోదర భావంతో, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* మే 26న తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – బక్రీద్ (ఈద్ అల్ ఆదా) పండగ భక్తికి ప్రతీకని, పండగను ముస్లిం సోదరులు మతసామరస్యంను పాటిస్తూ, శాంతియుతంగా నిర్వహించుకొనేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. గోవుల అక్రమ రవాణ జరగకుండా జిల్లా వ్యాప్తంగా శాశ్వతంగా ఏర్పాటు చేసిన 5 చెక్ పోస్టులకు అదనంగా మరో 22 తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, క్షుణ్ణంగా వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా, గోవుల అక్రమ రవాణ జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో 30 మూవింగ్ టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. వాహన తనిఖీలు, మూవింగ్ టీమ్స్ పని తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూం నందు ముగ్గురు సిఐలను నయంమించామన్నారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 11 కేసులలో 25మందిని అరెస్టు చేసి, 12 వాహనాలను, 160 పశువులను సీజ్ చేశామన్నారు. గతంలో కేసులు గల పాత నేరస్తులపై నిఘా పెట్టడంతోపాటు మళ్ళీ ఈ తరహా నేరాలకు పాల్పడకుండా వారిని బైండోవరు చేశామన్నారు. పశువుల విక్రయాలు జరిగే సంతలను కూడా మూయించామన్నారు. కొంతమంది వ్యక్తులు కాలి నడకన పశువులను రవాణ చేస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు.

జిల్లాలోని ముఖ్యమైన మసీదుల వద్ద డ్రోన్స్, సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. మతసామరస్యానికి ఎటువంటి విఘాతం కలగకుండా ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ముస్లిం – హిందువుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లోని చేసే అసత్య ప్రచారాలను సృష్టించడం , వ్యాప్తిచేయడం చేయకూడదన్నారు. అటువంటి వదంతులను నమ్మవద్దన్నారు. మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు లేదా వస్తువులు కనబడితే సమాచారాన్ని డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు అందించాలని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు. ముస్లిం సోదరులు స్వేచ్ఛగా ప్రార్థనలు చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పోలీసుశాఖ దృష్టికి తీసుకొని రావాలన్నారు. వెంటనే, పోలీసుశాఖ స్పందించి, అవసరమైన భద్రత చర్యలు చేపడుతుందని ముస్లిం పెద్దలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ భరోసా కల్పించారు. బక్రీద్ పండగ ప్రశాంతయుతంగా ముగిసే విధంగా భద్రత చర్యలు చేపట్టాలని, భద్రత ఏర్పాట్లను సంబంధిత డిఎస్పీలు, సీఐలు పర్యవేక్షించాలని అధికారును జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి