రిపోర్టర్… సునీత రెడ్డి విజయనగరం 

బహుముఖ వ్యూహాలతో జిల్లాలో గంజాయిని కట్టడి చేయడానికి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ తెలిపారు*

*మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్*

*గంజాయి అక్రమ రవాణకు సంబందించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబరు 1972కు అందించాలన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*

*ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, మరోవైపు దాడులను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ*

*గంజాయి డిటెక్షన్ కిట్స్ ఉపయోగించి గంజాయి సేవించిన వారిని నిమిషాల్లో నిర్దారిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు*

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలన, నియంత్రణకు పోలీసు, రెవెన్యూతోపాటు ఇతర లైను శాఖలకు చెందిన అధికారులు సమిష్టిగా పని చేయాలని జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ఐపిఎస్,* మే 30న పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మరియు జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో *నార్కోటిక్ కో-ఆర్డినేషను కమిటీ* (NCORD) సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్సు ద్వారా మే 30న నిర్వహించారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – జిల్లాలో గంజాయి వినియోగం చాలా వరకు తగ్గిందని, గంజాయి సరిహద్దు రాష్ట్రాలు ఒడిస్సా, చత్తీస్ ఘడ్ నుండి మన జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణ జరుగుతుందని, వాటి నియంత్రణకు చెక్ పోస్టులను బలోపేతం చేసామని, సమాంతరంగా విస్తృతంగా తనిఖీలను కూడా ఆకస్మికంగా చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా, గంజాయి వినియోగం, అక్రమ రవాణే నియంత్రణే లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’ కార్యక్రమంతో ప్రతి వారం జిల్లాలో ఎంపిక చేసిన గ్రామంలో కార్టన్ అండ్ సెర్చ్ తనిఖీలను చేపడుతున్నామన్నారు. ఈగల్ బృందాలు, స్థానిక పోలీసులు తరుచూ స్కూల్స్, కాలేజీలను సందర్శించి, గంజాయి వినియోగం వలన కలిగే అనర్దాలను వివరిస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను ప్రజలకు, యువతకు, విద్యార్థులకు వివరించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. డ్రగ్స్ అలవాటుపడిన వ్యక్తులు కొన్ని మత్తు కలిగించే మందులను కొనుగోలు చేసి, వాటిని వినియోగిస్తున్నందున డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి పోలీసు అధికారులు, సిబ్బంది మెడికల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారన్నారు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభాలను ప్రజలకు వివరిస్తూనే, మరోవైపు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా జిఆర్పీ, ఈగల్ వంటి ఇతర విభాగాలతో ట్రైన్ లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇటీవల ఒడిస్సా నుండి విశాఖపట్నం వైపు వెళుతున్న ట్రైనులో తనిఖీలు చేపట్టగా, “రుద్ర” అనే నార్కోటిక్ డాగ్ సుమారు 14కి.ల గంజాయిని కనిపెట్టిందని జిల్లా ఎస్పీ తెలిపారు. తరుచూ గంజాయి నేరాలలో పట్టుబడిన 10మంది నేరస్తులపై పిట్ ఎన్దిపిఎస్ క్రింద సంవత్సరం పాటు జైలుకు పంపడం జరిగిందని తెలిపారు.  గంజాయిని కట్టడి చేసేందుకు జిల్లాలో నిరంతరం పని చేసేందుకు ఐదు పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేసామన్నారు. గంజాయి వ్యాపారంతో కూడబెట్టిన నిందితుల ఆస్తులను అటాచ్ చేసామన్నారు. గంజాయికి అలవాటుపడిన వ్యక్తులను గుర్తించి, వారికి చికిత్స అందించేందుకు డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణ, నిర్మూలనకు పోలీసుశాఖ కట్టుబడి ఉందని, జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు ఇతర శాఖలు కూడా సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ – జిల్లాను గంజాయిరహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి, వాటి దుష్పప్రభావాల పట్ల పోలీస్ శాఖతో పాటుగా మిగతా శాఖలు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో తరుచుగా సమావేశాలు నిర్వహించి డ్రగ్స్ వినియోగం కలిగే దుష్ప్రభావాలను విద్యార్ధులకు, తల్లిదండ్రులకు వివరించాలన్నారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు పోలీసు వారితో పాటు ఆర్టీఎ, జిఆర్పీ, డ్రగ్ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర డిపార్టుమెంట్స్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర్ రెడ్డి ఆదేశించారు.

ఈ జూమ్ మీటింగులో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఈగల్ మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి