పట్టుదలతో చదివితే గ్రామీణ విద్యార్థులు అద్భుతాలు చేస్తారు– ఇంటర్ టాపర్‌ను అభినందించిన మంత్రి కొండపల్లివిజయనగరం, ఏప్రిల్ 18 : గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టుదలతో చదివితే అద్భుతాలు సాధిస్తారని.. అందుకు విద్యార్థి రెడ్డి తేజస్విని నిదర్శనం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశంసించారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని పెదమేడపల్లి గ్రామానికి చెందిన రెడ్డి తేజస్విని 1000కు 991 మార్కులతో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. గొట్లాం గాయత్రి జూనియర్ కళాశాలలో చదివిన తేజస్విని ఎంపీసీ విభాగంలో ఈ మార్కులు సాధించారు. ఈ క్రమంలోనే శనివారం తేజస్విని తన తల్లిదండ్రులతో కలిసి మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి తేజస్వినికి సాలువా కప్పి అభినందించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గాయత్రి తల్లిదండ్రులతో పాటు కళాశాల అధ్యాపకులకు కూడా మంత్రి అభినందనలు తెలిపారు. Spread the love టపా నావిగేషన్ రక్తహీనతపై వైద్యాధికారులు/కమ్యూనిటీ హెల్త్ అఫ్ఫిసర్స్ కు అవగాహన కార్యక్రమం