రిపోర్టర్ PTR NAIDU చీపురుపల్లి

కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా ఆడబిడ్డ నిధి డబ్బులు ఇవ్వకుండా మహిళలని, పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న అవ్వా తాతలు,వితంతువులు, వికలాంగులను, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తూ వస్తుంది,అందుకే వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమం -బొత్స సందీప్ బాబు
చీపురుపల్లి పట్టణంలో మండల వైస్సార్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలు, వైస్సార్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు
★సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం,డాక్టర్ బొత్స సందీప్ బాబు

★వెన్నుపోటుకు రెండేళ్లు”కూటమి వైఫల్యాలపై చీపురుపల్లి మండలo లో వైఎస్సార్సీపీ నిరసన గళం,

చీపురుపల్లి నియోజకవర్గం, జూన్ 04,చీపురుపల్లి మండలం-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు, ex ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు ఆదేశాల మేరకు చేపట్టిన “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా, గురువారం చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి పట్టణంలో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి.ఈ నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ యువ నాయకురాలు డాక్టర్ బొత్స సందీప్, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండలపార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు, యూత్ అధ్యక్షులు బెల్లన వంశీ  మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ బొత్స సందీప్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఆశ చూపిన “సూపర్ సిక్స్” హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. యువత, మహిళలు, రైతులు మరియు సమాజంలోని అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేయడం వల్ల రాష్ట్ర ప్రజల్లో తీవ్ర నిరాశ, అసహనం నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.ప్రజల సంక్షేమం కోసం, వారికి ఇచ్చిన హామీల అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని డాక్టర్ సందీప్ స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన భవిష్యత్ కార్యాచరణను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని, ప్రజల పక్షాన నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
చీపురుపల్లి మెయిన్ రోడ్డు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాo నుంచి మూడురోడ్డుల జంక్షన్ వరకు వందలాదిగా ప్రజలు ర్యాలీ గా వెళ్లి కూటమి ప్రభుత్వం నశించాలి, సూపర్ సిక్స్ హామీలు వెంటనే అమలు చెయ్యాలి అని నినాదాలు హోరెతించారు **ఇదేమి రాజ్యo -ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అంటూ**యువత నినాథాలు మారు మొగయి మూడురోడ్డుల జంక్షన్ లో ప్రజలు కార్యకర్తలు తెలుగుదేశం బుటకపు మేనిఫెస్టో కాపీ లను చించివేశారు తెలుగుదేశంనాయకులుచంద్రబాబునాయుడుగారు,జనసేననాయకులుపవన్కళ్యాణ్ ప్రజలకుఎన్నికలముందుసూపర్ సిక్స్ హామీలకు మాది పూచి అని ప్రతికుటుంబానికి బాండ్ మీద సంతకాలు చేసి ఇచ్చారు అని సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు పూర్తిగా అందే వరకు వైస్సార్ పార్టీ ప్రజల తరుపున నిరంతరం పోరాటం చేస్తుందిఅని ప్రజా గొంతుక వినిపిస్తామని తెలియజేసారు, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైస్సార్ పార్టీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు,యూత్ అధ్యక్షులు బెల్లానవంశీ,ex AMC చైర్మన్ ధన్నాన జనార్ధన,జిల్లా బీసీ ఉపాధ్యక్షలు బెల్లాన త్రినాధరావు,1 సచివాలయం అధ్యక్షులు పతివాడరాజారావు,రేవల్ల సత్తిబాబు, అధికారుల శ్రీను బాబు, రఘుమండ త్రినాధ్ చందక గురునాయుడు, బాణన శ్రీను, రమణ, పిసిని శ్రీను, గవిడి సురేష్, కర్రోతు ప్రసాద్, గవిడి కల్కి జీవన్,రౌతు పైడిరాజు, కంచుపల్లి అశోక్ తో పాటు పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, సంక్షేమ పథకాల బాధితులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి