రిపోర్టర్ PTR NAIDU చీపురుపల్లి వెన్నుపోటుకు రెండేళ్లు”: కూటమి ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన వైఎస్సార్సీపీ యువ నాయకులు, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు మరియు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు, గరివిడి క్యాంప్ కార్యాలయంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పోస్టర్‌ను యువ నాయకురాలు డా, బొత్స అనూష, యువ నాయకులు డా,బొత్స సందీప్ ఆవిష్కరించారు. పాలనలో అట్టడుగున ప్రజలు,డా,బొత్స అనూష, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో డా, బొత్స అనూష మాట్లాడుతూ, రాష్ట్రంలో గడిచిన రెండేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితిని ప్రభుత్వం సృష్టించిందని, మెగా డీఎస్సీ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని మండిపడ్డారు.ఎన్నికల సమయంలో హామీ ఈచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేస్తున్నారని, లబ్ధి పొందిన వారి కంటే పొందని వారే ఎక్కువగా ఉన్నారని విమర్శించారు.ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టిన ఏడాది కాలంలోనే బస్సులను నడపలేక నిలిపివేసే దుస్థితికి ప్రభుత్వం దిగజారిందని ఎద్దేవా చేశారు.ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునే నాథుడే కరువయ్యారని, అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని పేర్కొన్నారు. ”సూపర్ సిక్స్” అమలు చేసే వరకు పోరాటం,డా, బొత్స సందీప్, డా, బొత్స సందీప్ మాట్లాడుతూ, చంద్రబాబు పాలనను చూసి తాము ప్రారంభంలోనే “బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ” అనే కార్యక్రమాన్ని చేపట్టామని, ఆయన తీరులో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ఈప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఈచ్చిన “సూపర్ సిక్స్” హామీలను అమలు చేసే వరకు వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన కార్యాచరణలో భాగంగా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ క్రింది విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నాయకులు వెల్లడించారు,జూన్ 4,మండల కేంద్రాల్లో టీడీపీ పాలనపై నిరసన ప్రదర్శనలు.జూన్ 8 & 9 “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో టౌన్ హాల్ సదస్సులు.జూన్ 12 నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ మరియు ప్రజా సమస్యలపై నిరసన.ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు, విద్యార్థి, యువజన, మహిళా విభాగాల నాయకులకు, మరియు సంక్షేమ పథకాల బాధితులకు వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె.వి. సూర్యనారాయణ (పులిరాజు), చీపురుపల్లి నియోజకవర్గం నాలుగు మండలాల నాయకులు కోట్ల వెంకటరావు, వలిరెడ్డి శ్రీను, విశేశ్వరావు, సన్యాసి నాయుడు, వరహాల నాయుడు, బెల్లాన వంశీ, సీర అప్పలనాయుడు, కృష్ణం నాయుడు, వేణు, వై. అప్పల నాయుడు, బంగారు నాయుడు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు మరియు వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. “: కూటమి ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన వైఎస్సార్సీపీ యువ నాయకులు,చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు మరియు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు, గరివిడి క్యాంప్ కార్యాలయంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పోస్టర్‌ను యువ నాయకురాలు డా, బొత్స అనూష, యువ నాయకులు డా,బొత్స సందీప్ ఆవిష్కరించారు.పాలనలో అట్టడుగున ప్రజలు,డా,బొత్స అనూష,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో డా, బొత్స అనూష మాట్లాడుతూ, రాష్ట్రంలో గడిచిన రెండేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితిని ప్రభుత్వం సృష్టించిందని, మెగా డీఎస్సీ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని మండిపడ్డారు.ఎన్నికల సమయంలో హామీ ఈచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేస్తున్నారని, లబ్ధి పొందిన వారి కంటే పొందని వారే ఎక్కువగా ఉన్నారని విమర్శించారు.ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టిన ఏడాది కాలంలోనే బస్సులను నడపలేక నిలిపివేసే దుస్థితికి ప్రభుత్వం దిగజారిందని ఎద్దేవా చేశారు.ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునే నాథుడే కరువయ్యారని, అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని పేర్కొన్నారు.“సూపర్ సిక్స్” అమలు చేసే వరకు పోరాటం,డా, బొత్స సందీప్,డా, బొత్స సందీప్ మాట్లాడుతూ, చంద్రబాబు పాలనను చూసి తాము ప్రారంభంలోనే “బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ” అనే కార్యక్రమాన్ని చేపట్టామని, ఆయన తీరులో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ఈప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఈచ్చిన “సూపర్ సిక్స్” హామీలను అమలు చేసే వరకు వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన కార్యాచరణలో భాగంగా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ క్రింది విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నాయకులు వెల్లడించారు,జూన్ 4,మండల కేంద్రాల్లో టీడీపీ పాలనపై నిరసన ప్రదర్శనలు.జూన్ 8 & 9 “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో టౌన్ హాల్ సదస్సులు.జూన్ 12 నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ మరియు ప్రజా సమస్యలపై నిరసన.ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు, విద్యార్థి, యువజన, మహిళా విభాగాల నాయకులకు, మరియు సంక్షేమ పథకాల బాధితులకు వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె.వి. సూర్యనారాయణ (పులిరాజు), చీపురుపల్లి నియోజకవర్గం నాలుగు మండలాల నాయకులు కోట్ల వెంకటరావు, వలిరెడ్డి శ్రీను, విశేశ్వరావు, సన్యాసి నాయుడు, వరహాల నాయుడు, బెల్లాన వంశీ, సీర అప్పలనాయుడు, కృష్ణం నాయుడు, వేణు, వై. అప్పల నాయుడు, బంగారు నాయుడు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు మరియు వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ 4.13 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి