సునీత రెడ్డి విజయనగరం విజయనగరం, జూన్ 8: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమలో వచ్చిన అర్జీలను పరిష్కరిండంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు భాద్యత వహించాలని జిల్లా కలెక్టరు ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో ప్రజలు అందజేసిన అర్జీలు పరిష్కారంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు బాద్యత తీసుకోవాలన్నారు. కింది స్థాయి సిబ్బంది సకాలంలో పరిష్కారం చూపేలా పర్యవేక్షణ చేయాలని, అర్జీదారునితో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. మునిసిపాలిటీ, గ్రామీణ నీటిసరఫరా, పెన్షన్లు పంపిణీ తదితర పధకాలకు సంబంధించి ప్రజా సానుకూలత శాతం తగ్గడంపై అసంతృప్తివ్యక్తంచేసారు. ఆయా కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని, ప్రజా సానుకూలత 90 శాతం సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింటు కలెక్టరు సేధు మాధవన్, జిల్లా రెవిన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న యువనాయకుడు D.R బొత్స సందీప్ బాబు పోలీసు సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు