సాలూరు:- ఐక్య పోరాటంతో డిమాండ్లు సాధిద్దామని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి, ఏపీ శ్రామిక మహిళ ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ బలగ.రాధనాయుడు పిలుపునిచ్చారు.శుక్రవారం సాలూరు పట్టణంలో ఉన్న రైస్ మిల్స్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, హోల్ సేల్ కిరాణా, హోల్ సేల్ ఉల్లిపాయలు, హోల్ సేల్ ఆయిల్ షాప్ లలో పనిచేస్తున్న హమాలీ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కార్మికులను ఉద్దేశించి రాధా నాయుడు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులకు శ్రమ దోపిడీ జరుగుతుందని దాన్ని నిలువరించాలంటే కార్మికులంతా ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తూ కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్ ని తీసుకొచ్చారని రద్దు చేసేవరకు పోరాటం కొనసాగించాలన్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న హమాలీల కూలీ రేట్లు మాత్రం పెరగడం లేదని, కష్టానికి తగ్గ కూలిరేట్లు సాధించేవరకు ఏఐటీయు సి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.కూలీరేట్లు పెంచే విషయంలో హోల్ సేల్ వ్యాపార యజమానులు ఆలోచన చేసి కళాశీల కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు.అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.కళాశీల జట్లు సంఘ ప్రెసిడెంట్ గా కరణం శంకర్రావు కార్యదర్శి గా పూడి రాము ఏఐటీయూసీ సాలూరు ప్రెసిడెంట్ గంధం శంకర్రావు వైస్ ప్రెసిడెంట్ శంకర్రావు కళాసిజట్లు సంఘం గౌరవ అధ్యక్షురాలుగా బలగరాధనాయుడు కార్యవర్గపు సభ్యులు సత్యనారాయణ త్రినాధ రామారావు నాగేశ్వరరావు లను ఎన్నుకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో పలు జట్ల కళాశీలు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ వ్యర్ధాలను తొలగించారు