రిపోర్టర్… సునీత రెడ్డి విజయనగరం
జీవితాలను నాశనం చేసే బెట్టింగు యాప్ ల జోలికి పోతే.. జైలే దిక్కని యువతకు పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ,ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విస్తృతంగా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*

ఐ.పి.ఎల్. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బెట్టింగు రాయుళ్ళును, ఆన్-లైన్, ఆఫ్ లైన్ బెట్టింగు ముఠాలను జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* మే 30న మరోసారి తీవ్రంగా హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – ఐపిఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా యువత క్రికెట్ బెట్టింగులకు పాల్పడి డబ్బులు నష్టపోయే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది తనిఖీలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. క్రికెట్ బెట్టింగులను నియంత్రించేందుకు పోలీసు అధికారులు తమ స్టేషను పరిధిలోని లాడ్జిలు, హాస్టల్స్, విద్యార్థులు, యువత ఎక్కువగా గుమిగూడే కళాశాలలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. తనిఖీలు సమయంలో యువత మొబైల్ ఫోనులను తనిఖీ చేసి బెట్టింగు యాపులను తొలగించాలన్నారు. బెట్టింగులకు పాల్పడడం వలన కలిగే అనర్ధాలను యువతకు వివరించాలన్నారు. బెట్టింగులకు పాల్పడటం వలన ఆర్థికంగా నష్ట పోవడంతోపాటు, విద్యాభ్యాసం దెబ్బతింటుందన్న విషయం పట్ల యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో యువత క్రికెట్ బెట్టింగు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్నారు. అవసరాలకు డబ్బులు చాలక రుణాల కోసం అనధికార లోన్ యాప్ లను ఆశ్రయిస్తున్నారన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి సారించాలని సూచించారు. మంచి లక్ష్యాలతో ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. ఆన్ లైను క్రికెట్ బెట్టింగు యాప్ లతో డబ్బులు సంపాదించడం సాధ్యం కాదన్నారు. యాప్ తయారీదార్లు డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే బెట్టింగు యాప్  లను రూపొందించి, యువతను ఆకర్షిస్తారన్నారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడి, పోలీసులకు పట్టుబడి, పోలీసు స్టేషన్లులో కేసులు నమోదైతే, ఉద్యోగాలు పొందే అవకాశం ఉండదన్నారు. కావున, జీవితాలను నాశనం చేసే ఆన్ లైను /ఆఫ్ లైను బెట్టింగుల జోలికి పోవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు.

జిల్లాలో క్రికెట్ బెట్టింగును తీవ్రమైన నేరంగా పరిగణించి, నిఘా వ్యవస్థను బలోపేతం చేసి, సమాచారం సేకరించి, ఆకస్మిక దాడులు నిర్వహించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. క్రికెట్ బెట్టింగులకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100/112 లేదా స్థానిక పోలీసు అధికారులకు అందించాలని ప్రజలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కోరారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి